పబ్లిక్ లో ఉండే వాళ్ళు ప్రతిక్షణం చాలా ఎలర్ట్ గా ఉండాలి. ప్రైవేట్ అనేది చాల తక్కువ కనుక అసలు మొత్తంగా జీవితం సెలబ్రేషన్ లాగే అందరికి కనిపించాలి. ఈ విషయం గురించి చెబుతూ రాశిఖన్నా నాకు బుక్స్ చదవటం ఇష్టం. జీవితం మంచి పుస్తకంలాగా ఉండాలనిపిస్తుంది. కాని ప్రతి పేజీ అందంగా ఉంటుందంటే చెప్పలేను కాని ప్రతి అక్షరం ప్రతి పేజీ మనం రాసుకున్నదే అయితే ఎంతబావుంటుంది. వృత్తిపరంగా ఎంత బిజీగా ఉన్నా వ్యక్తిగతంగా నాకు ముఖ్యమే. ఆ జీవితంలో దొరికే ఏ చిన్న ఆనందాన్ని దూరం చేసుకోరు. మనసు చెప్పిన మాటకు కట్టుబడి నిర్ణయాలు తీసుకుంటాను అంటుంది రాశీఖన్నా. ఆమె చెప్పినట్లు జీవితం అందంగా మనం జీవిస్తేనే ఉంటుంది. ప్రతి పేజీ అక్షరం మనం రాసుకున్నదే అనే భావన కలిగేంతంగా జీవితం పుస్తకంలాగా ఉండాలంటుంది ఆమె.

Leave a comment