ప్రస్తుత భారత దేశంలో దళిత పోరాటాలు  రూపాన్ని ప్రేక్షకుల ముందుకు తెచ్చిందీ  సినిమా మేము మనుషులమే అర్థం తో ఈ సినిమా ఎన్నో ప్రశంసలు అవార్డులు గెలుచుకుంది దళితుడైన కోలప్పన్ తండ్రి  చనిపోతాడు ఆ వూరి ప్రధాన మార్గం ద్వారా దళితులు మృతదేహాలను తీసుకుపోయేందుకు అగ్రకులాల అంగీకారం లేదు ప్రభుత్వం ఇచ్చిన రహదారిలో మాకు నడిచే హక్కు ఉందని కోలప్పన్ కోర్టుకు వెళ్తాడు వివాదం జరుగుతున్న మూడు రోజులుగా కోలప్పన్ తండ్రి శవంఅతని ఇంటి వాకిట్లోనే ఉంది. ప్రభుత్వం అనుమతి ఇచ్చిన అగ్రకులాల వాళ్ళు, పోలీసులు కలిసి కోలప్పన్ బంధువులతో సహా అరెస్టు చేసి, అతని తండ్రి శవాన్ని ఎక్కడో తెలియని చోట దహనం చేసేస్తారు. ఆ శవం ఎక్కడ  భూస్థాపితం అయిందో కూడా కొడుకు తెలుసోలేకపోవటం ఈ వెలి వాడల్లో ఉండే దళితుల జీవితాలకు అద్దం పట్టిన ఈ సినిమా తప్పకుండా చూడవలసిన సినిమాల్లో ఒకటి.
రవిచంద్ర. సి 
7093440630

Leave a comment