Categories
సాధారణంగా కాటన్ దుస్తులే ధరించినపుడు కాటన్ చీరపైనా మరక పడితే వదలడం కష్టమే హెవీ డ్యూటీ లిక్విడ్ లేదా రెండు భాగాలు డిటర్జంట్ ఒక భాగం నీరు కలిపి పేస్ట్ లాగా తయారు చేయాలి.శుభ్రమైన టూత్ బ్రష్ తీసుకొని మరకపైన ఈ పేస్ట్ రాయాలి. గట్టిగా రుద్దటం వల్ల మరక ఫ్యాబ్రిక్ లోకి మరింతగా వెళ్ళిపోతుంది. కొద్దిసేపు ఆలా వదిలేసి చేత్తో మరకపడిన ప్రాంతంలో నలుపుతూ ఉతికితే సరిపోతుంది. ఫ్యాబ్రిక్ మరీ సున్నితం కాకపోతే అప్పుడు దాన్ని వేడి నీళ్ళలో ముంచితే ఆనవాలు లేకుండా పోతుంది. మరక పోకపోతే ఇంకోసారి దాన్ని ట్రై చేయాలి అంతేగాని వెంటనే ఎండలో వేయవద్దు.