ముదితలూ!!కార్తీకంలో నుంచి మార్గశిరంలోకి అడుగు పెట్టాము.ఈ మాసంలో వచ్చే ప్రతి గురువారం లక్ష్మీ దేవికి ప్రీతికరమే.

మార్గశిర లక్ష్మీదేవకి వ్రతం చేస్తే  అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయి.ఈ వ్రతం చేసే వారు ఉపవాసం ఉండి, తలకు నూనె పట్టించ కూడదు,తలలో దువ్వెన్నతో దువ్వకూడదు.సుశీల అనే భక్తురాలు మట్టితో లక్ష్మీదేవి రూపం చేసి నిత్యం పూజించేది.పుట్టింట్లో అష్టైశ్వర్యాలతో తులతూగారు.సుశీల వివాహ అనంతరం అత్తగారు వాళ్ళు కుబేరులైనారు.
ఈ వ్రతం క్రమం తప్పకుండా చేయాలి 5 గురువారాలు చేయడం వల్ల అమ్మవారి కటాక్షం తప్పకుండా వుంటుంది.

నిత్య ప్రసాదం: 1-గురువారం:పులగం
                       2-గురువారం:అట్లు
                       3-గురువారం:అప్పాలు
                       4-గురువారం:చిత్రాన్నం
                       5-గురువారం:పూర్ణబూరెలు.

             -తోలేటి వెంకట శిరీష

Leave a comment