కేశాలంకారణలో కొన్ని టిప్స్ నేర్చుకుంటే అవే కొన్ని సందర్భాల్లో పార్టీల్లో ప్రత్యేకంగా కనిపించేలా చేస్తాయ్. కాస్త పొట్టిగా చిన్న జుట్టే ఉంటే దానికో పోనీ వేయచ్చు. రెండు చేతులతో సమానంగా జుట్టుని పైకెత్తి నడినెత్తికి కిందగా తెచ్చి బననా క్లిప్ పెడితే జుట్టు ఒత్తుగా కన్పిస్తుంది. అలాగే ఎప్పుడూ పాపిడి తీసుకోవటమో లేక వెనక్కి దువ్వు కోవటం కాకుండా పఫ్ ట్రై చేస్తే బావుంటుంది ఇవాళ్టి ట్రెండ్ కూడా . జుట్టు ముందర భాగాన ఎత్తుగా కనిపిస్తూ కొత్త లుక్ వస్తుంది . ఇక పొడవైన జుట్టయితే జుట్టంతా వెనక్కి దువ్వేసి రబ్బరు బ్యాండ్ పెట్టుకుని ఇక కాస్త దూరం జుట్టు వదిలి ఒక రబ్బరు బ్యాండ్ ఆలా కొంచెం కొంచెం ఎడంగా జడలా మొత్తం జుట్టుతో పువ్వులు చేసినంత బావుంటుంది. అసలు ఇలాంటి ట్రిక్స్ వందలాది వేలాది వున్నాయి డిఫరెంట్ హేయిర్ స్టయిల్స్ పైన.
Categories