![ముఖం కాంతిగా తాజాగా అనిపించాలంటే వంటింటి టిప్స్ వందల కొద్దీ ఉంటాయి. తవ్వితే ఊరే చాల మల్లాగా. ఇవి తరాల నుంచి వస్తున్నా సౌందర్య సాధనాలు. పాల మీగడ నారింజ రసం సెనగపిండి కలిపి మంచి ఫేస్ ప్యాక్. యాపిల్ ముక్కలు గుజ్జు పాల పొడి ఇంకో నాలుగు చెంచాల పాలు ఇంకో మంచి కాంబినేషన్. మూడు చెంచాల పెసర పిండి పసుపు పాలు కలిపితే చర్మ సంబంధిత ఇన్ఫెక్షన్లను కూడా పోగొట్టే మంచిపూత అవుతుంది. నిమ్మరసం తేనె కలిపి మొహానికి రాసి కీరా ముక్కలు మృదువుగా మసాజ్ లాగా రుద్దితే చర్మం మృదువుగా కోమలంగా తయారవుతుంది. ఇప్పుడంటే ఖరీదైన కాస్మెటిక్స్ వచ్చాయి. మరి పురాతన కాలంలో అందంకోసం ఇవే పద్ధతులు. ఏ సైడ్ ఎఫెక్ట్స్ లీని చక్కని ప్యాక్ లు.](https://vanithavani.com/wp-content/uploads/2016/11/traditional-face-packs.jpg)
మెంతుల్లో అధిక మోతాదులో ప్రోటీన్,నికోటిసిన్ లెసిథిన్ పొటాషియం లభిస్తాయి. ఇవి జుట్టు ఆరోగ్యంగా ఉండేందుకు ఉపయోగపడేవి. నాన పెట్టిన మెంతి పిండిలో కొబ్బరి పాలు కలిపి తలకు ప్యాక్ వేసుకొంటే జుట్టు మెత్తగా మెరిసిపోతుంది. ఈ ప్యాక్ జుట్టు చక్కగా ఎదిగేందుకు సాయం చేస్తుంది. పావు కప్పు మెంతులు నానపెట్టి మెత్తగా రుబ్బి దానికి పాలపొడి,పెరుగు కలిపి పేస్ట్ లా చేసి మొహానికి ప్యాక్ వేసుకోవాలి అరగంట ఆగి గోరువెచ్చని నీళ్లతో కడిగేస్తే చర్మం పై ఉండే మచ్చలు పోతాయి. నాన బెట్టిన మెంతి పిండిలో తేనె,పంచదార కలిపి మెడ,ముఖం,మెచేతులపైన రాసి అవసవ్య దిశల్లోమెత్తగా రుద్దితే మృతకణాలు పోతాయి మొహం
మెరుపుతో ఉంటుంది. ఛాయ మెరుగవుతోంది.