పత్తి నుంచి పట్టు పురుగుల నుంచి నూలు పట్టు తీసినట్లే తామర తాళ్ళ నుంచి కూడా ఈ దారం తీసి నలిగి పోకుండా తేలిగ్గా మెరిసే పట్టు వస్త్రాలు తయారు చేస్తున్నారు. మయన్మార్ కంబోడియా వాళ్ళు ఇప్పుడు మణిపూర్ కు చెందిన విజయశాంతి ఈ లోటస్ సిల్క్ తయారీ నేర్చుకుని మహిళలకు శిక్షణ ఇచ్చి ఉపాధి కేంద్రం మొదలుపెట్టింది. జర్మనీ కి చెందిన ఓ ప్యాషన్ బ్రాండ్ ఈ వస్త్రాన్ని కొంటుంది లోటస్ సిల్క్ తో తయారైన దుస్తులు ఆన్ లైన్ లో అమ్మకానికి సిద్ధంగా ఉన్నాయి. తామర కాడనే మధ్యకు విరిచి లాగితే దారాలు గా వస్తుంది ఈ దారాన్ని వచ్చినంత పొడవుగా లాగి ఒక దారంగా పేని ఎండవేస్తారు.వీటిని రంగులు వేసి మగ్గం పైన నేస్తారు. ధర పట్టు కంటే పదిరేట్లు ఎక్కువ. సాంప్రదాయ పట్టుకుంటే ఈ లోటస్ సిల్క్ ని ఈ తరం మెచ్చుకొంటున్నారని,అమ్మకాలు రుజువు చేస్తున్నాయి.

Leave a comment