రెండు మూడు అంగుళాల పొడవు చిన్న ఆకులుంటే మైక్రో గ్రీన్స్  పెద్ద శ్రమ ఖర్చు లేకుండా ఇంట్లోనే పెంచుకోండి అంటున్నారు నిపుణులు. రెండు అరలుగా ఉండే  డబుల్ కేప్ కంటైనర్లు బజారులో దొరుకుతున్నాయి. పై అరకు రంధ్రాలు ఉంటాయి కింది అరలో నీళ్ళు పోసేందుకు వీలుగా ఉంటుంది.ముందుగా ఏదైనా విత్తనాలు కప్పు నీళ్ళలో పోసి నాననిచ్చి వాటిని రంద్రాలున్న పై కంటైనర్ అరలో వెయ్యాలి .కింద ఉన్న నీళ్లు రెండు రోజులకోసారి మార్చాలి.సూర్యరశ్మి అందేలా చూసుకోవాలి మొలకలు వచ్చి నెమ్మదిగా వేళ్ళు ఆకులు సంతరించుకుంటాయి.ఏడు ఎనిమిది రోజులకే బుల్లి మొక్కలు కనిపిస్తాయి. ఈ మొక్కలను పెంచే విధానం ఇంకా వివరంగా చూడాలంటే యూట్యూబ్ వీడియోలు ఎన్నో ఉన్నాయి తప్పకుండా మైక్రో గ్రీన్స్ పెంచండి సూప్స్, సలాడ్స్, డ్రై కర్రీస్ చేసుకోవచ్చు.

Leave a comment