ఇంటి ముందు నలుగు పచ్చని మొక్కలుంటే అందమే అందం. అలాగే కొందరికి మొక్కల పెంపకం విపరీతమైన ఇష్టం. ఎంత ఇష్టమైనా రెండు రోజుల పాటు ఏదైనా ఊరెళ్ళినా, ఈ ఎండకు ఓ పూట నీళ్ళు పోయడం మర్చిపోయినా,సాయంత్రానికి మొక్కలు తలలు వాల్చేస్తాయి. మొక్కల పెంపకం ఇష్టం వుండి, హాడావిడిగా తిరిగే వుద్యోగాలున్న వాళ్ళ కోసం ప్రత్యేకంగా వచ్చాయి. ప్యారెట్ పాట్స్. ఈ కుండీలో రెండు పొరలుంటాయి. ఈ ప్యారెట్ పాట్ అడుగులో వుండే చిన్ని తొట్టెలో వారానికి ఒక సారి నీళ్ళు పోస్తే చాలు. మొక్క మొదట్లో తేమ తగ్గిపోవడం కుండీనే తెలుసుకుని కింద వున్న నీటిని సన్నని ధారగా అవసరమైనంత మేరకు మొక్కకు పోస్తుంది. స్పెంసర్ల ద్వారా పని చేసే ఈ కుండీ ఇలా తేమ శాతం గుర్తించడం, మొక్కకు సరైన పోషకాలండుతున్నాయా? కాంతి సరిపోతుందా? ఎక్కువవుతుందా? అన్న విషయాలు ఆప్ ద్వారా మన ఫోన్ కు పంపిస్తుంది. ఈ ఏర్పాట్లున్నాక మొక్కల పెంపకం ఈజీ అయిపోదూ?

Leave a comment