Categories
WhatsApp

మొక్కను మించిన గిఫ్టే లేదబ్బా!

ఈ మధ్య కాలంలో రూఫ్ గార్డెన్ ప్రొమోషన్ బ్రహ్మాండంగా సాగుతుంది మొక్కలు ఇప్పుడు అందరికి ఇష్టమైన హాబీ అయిపోతున్నాయి. అలాగే అదే మొక్కలు ఇప్పుడు చక్కని బహుమతులు కుడా. చక్కని మొక్కల కంటే అందమైన బహుమతులు ఇంకేముంటుంది. ఆన్ లైన్ లో ఆ మొక్కల గిఫ్ట్ కోసం ఓ సారీ వెతకండి. లక్కి బాంబూ అంటే ఓ వెదురు మొక్క ప్రత్యక్ష్యం అవుతుంది. అలాగే చక్కగా మొత్తం పువ్వులతో నిండి వున్న మందార మొక్కను కుడా గిఫ్ట్ మొక్కలుగా నర్సరీల్లో ఆన్ లైన్ లో అమ్ముతున్నారు. కష్ట చోటున్నా చిన్న మొక్కలను పెంచుకోమని ప్రచారం చేసినట్లు వుంటుంది. బహుమతి ఇచ్చినట్లు వుంటుంది. ఈ సారి ఫ్రెండ్ బర్త్ డేకి అందమైన హంగింగ్ కుండీల్లో రెండు దవనం మొక్కలు పెట్టి బహుమతిగా ఇవ్వండి స్నేహం ఎంతో మంచి సువాసన లాంటిది అని చెప్పకనే చెప్పొచ్చు.

Leave a comment