బ్రౌన్ షుగర్ స్క్రబ్ గా,వాడితే చర్మం ప్రకాశవంతంగా అయిపోతుంది. బ్రౌన్ షుగర్ (ముడి చక్కెర)చర్మ సంరక్షణకు వాడితే ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి.బ్రౌన్ షుగర్ తేనె సమన పరిమాణంలో తీసుకుని ఇందులో రెండు చుక్కల రోజ్ ఆయిల్ కలపాలి ఇందులో ఉండే  గ్లైకోలిక్ యాసిడ్ ఎండ వల్ల రంగు కోల్పోయిన చర్మాన్ని ప్రకాశవంతంగా చేస్తుంది. ఈ మిశ్రమంతో ముఖం మృదువుగా రుద్ది పావుగంటాగి మొహాన్ని శుభ్రం చేసుకోవాలి.ఒక కప్పు బ్రౌన్ షుగర్ లో కొద్దిగా పాలు ఓ స్పూన్ పెసరపిండిని కలిపి పేస్ట్ లా చేసి ముఖానికి పూతలా వేసుకోవాలి.బాగా ఆరాక కడిగేస్తే మొటిమలు,ముడతలు, మచ్చలు అన్ని తగ్గిపోతాయి.

Leave a comment