Categories
మొటిమల సమస్యకు ఆహారం చక్కని పరిష్కారం అంటున్నారు నిపుణులు. టోమోటోల్లో పుష్కలంగా ఉండే యాంటీ ఆక్సిడెంట్లు చర్మ మృదుత్వాన్ని కాపాడుతాయి. మొటిమలు రాకుండా చేస్తాయి.వెల్లుల్లి లోని ఎలిసిన్ చర్మంలోని హానికారక బ్యాక్టిరియా వైరస్ లను నియంత్రించటం ద్వారా మొటిమలు రాకుండా చేస్తాయి. ముఖాన్ని వేడి నీటితో శుభ్రం చేస్తూ ఉంటే మొటిమలు రావు. నిమ్మపండు ముక్కలు మొటిమలపై తేలిగ్గా రాస్తే చాలు . నిమ్మలో ఉండే సిట్రిక్ యాసిడ్ మొటిమలకు కారణమైన బ్యాక్టిరియాను చంపేస్తుంది. పచ్చి బంగాళ దుంపలో ఉండే యాంటీ ఇన్ఫ్ల మేటర్ గుణాలు మొటిమలను తగ్గిస్తాయి. సహాజమైన యాంటీ బ్యాక్టీరియా లేత మొటిమలకు మంచి మందు.