Categories
WhatsApp

మొటిమల మచ్చలు తొలగించే చికిత్సలు.

ముఖం పైన ముక్కు పైన మొటిమల మచ్చల గురించి ఎన్నో క్రీమ్స్ అందుబాటులో వున్నాయి కానీ అవేమీ అంత ప్రయోజనకరమైన ఫలితాలు ఇవ్వవు ఈ మచ్చల్ని ఫ్రాక్షనేటెడ్ సిబలేజర్ చికిత్స ద్వారా తొలగించుకోవచ్చు. దీని కోసం మచ్చల స్థాయిని బట్టి నాలుగు నుంచి ఆరు సిట్టింగ్స్ అవసరం అవ్వుతాయి. ఇలాంటి చికిత్సలు దేశ వ్యాప్తంగా చాలా కాస్మెటిక్ డెర్మటాలజీ క్లీనిక్స్ లో లభ్యం అవ్వుతాయి. ఆ తర్వాత గల కాస్మెటిక్ డెర్మటాలజిస్ట్ లేదా ప్లాస్టిక్ సర్జరీ మాత్రమే ఈ చికిత్సలు చేయగలరు. అంతే కానీ మాములు బ్యూటీ క్లీనిక్స్ లో ఎలాంటి వైద్య నేపధ్యం లేని బ్యూటీషియన్స్ చేసే చికిత్స లో ఈ మచ్చలు పోవు. ఈ చికిత్స తర్వాత చర్మం కాస్త కందినట్లు అవుతుంది కానీ మూడు నుంచి ఐదు రోజుల్లో తగ్గిపోతుంది. కనీసం వారం రోజులు సూర్య కిరణాలు తగలకుండా జాగ్రత్త తీసుకోవాలి.

Leave a comment