Categories
దంతాలు ఆరోగ్యంగా ఉండాలంటే ,నోరు తాజాగా అనిపించేందుకు మౌత్ ఫ్రెషనర్స్ వాడుతువుంటారు. కొన్ని రకాల పండ్ల పదార్దాలు అలాంటి తాజా శ్వాస నిచ్చేందుకు సాయపడతాయి. యాపిల్ లోని మాలిక్ యాసిడ్ పళ్ళని శుభ్రం చేస్తుంది నోరు తాజాగా వుంటుంది . స్ట్రాబెర్రి అనాస లోని బ్రోమిలిన్ విటమిన్-సి పోషకాలు నోటిని తాజాగా వుంచుతాయి. చీజ్ పనీర్ లోని కాల్షియం ,ఫాస్పరస్ నోటిలోని లాలాజలం ఉత్పత్తి కావటానికి సహకరిస్తాయి. నోట్లో తగినంత లాలాజలం వుంటే నోటి దుర్వాసన కు అయ్యె బాక్టీరియా ఉత్పత్తి కాదు. అలాగే నీరు నోటిలోని యాసిడ్ ఉత్పత్తులను నియంత్రణలో ఉంచుతోంది. పెరుగులో బాదం పలుకులు,స్ట్రాబెర్రి కలిపి తింటే నోట్లో తాజాదనానికి ఢోకా వుండదు.