Categories
ఇప్పుడు కరోనా వైరస్ సమస్య వచ్చాక బయట ఏ రెస్టారెంట్ లోనో,భోజనం చేయటం కూడా కష్టమే. ఆఫీస్ కు,కాలేజీకో వెళ్లాలంటే హాండ్ బ్యాగ్ తో పాటు లంచ్ బ్యాగ్ కూడా పట్టుకుపోవాలి. ఈ రెండు మోసుకు పోవటం కష్టం కదా హాండ్ బ్యాగ్ లో లంచ్ బాక్స్ పెట్టుకొంటే అందులో పదార్ధాలు వలికిపోతే కష్టం కూల్ డ్రింక్ లు,జ్యూస్ లు పెట్టుకుంటే చమ్మగా అయిపోతుంది. అలాకాకుండా హాండ్ బ్యాగ్ నే లంచ్,స్నాక్ బ్యాగ్ లాగా ఉపయోగించుకొనేలా మల్టీ ఫంక్షన్ హాండ్ బ్యాగ్ లు వస్తున్నాయి. వీటిలో లంచ్ బాక్స్ స్నాక్ మొదలైనవి పెట్టుకొనేందుకు వాటర్ ప్రూఫ్ అర వుంటుంది అందులో ఆహార పదార్దాలు పెట్టి జిప్ వేసేస్తే బ్యాగ్ పదవుతుందన్న భయం కూడా ఉండదు. వాడుకొనేందుకు సులభం కూడా.