ఈ లాక్ డౌన్ సమయంలో ఏర్పడే ఒత్తిడి కి ఉపశమనం ముంబయ్ మేరి జాన్ సినిమా. ఇది జులై 11,2006 లో ముంబయ్ రైలు బాంబ్ దాడుల సేపద్యంలో జరిగిన కథ ఇక్కడే జీవించే ఎంతో మంది ప్రజల ఆత్మ ఈ చిత్రం. ఆనాటి రైల్ బాంబు తో 209 మంది మరణించారు. 700 మందిపైగా గాయపడ్డారు. సినిమాలో ఒక సక్సెస్ ఫుల్ టివి రిపోర్టర్ గా సోహా ఆలీఖాన్,పర్యావరణ స్పృహ ఉన్న ఎగ్జిక్యూటివ్ గా మాధవన్ . కంప్యూటర్ టెక్ గా కె కె మినాన్,పదవీ విరమణ చేయనున్న పోలీస్ బాస్ గా పరేష్ రావల్,టీ అమ్మే వ్యాపారిగా ఇర్ఫాన్ ఖాన్ నటించారు. ఒక సంఘటన జరిగాక ఆప్రభావం ప్రజలపైన పడుతోంది. మొత్తం ముంబయ్ ఉలిక్కి పడింది. ప్రశాంతంగా ఉన్న కొలనులో రాయిపడితే అలలు లేచి,కాసేపటికి అణిగిపోయి తిరిగి ప్రశాంతంగా సర్దుకొన్నట్లు ముంబయ్ లో కూడా ప్రజా జీవితం స్థిమిత పడుతోంది. దుర్మార్గం,ద్వేషం,కోపం,అసూయా,వంటి వ్యతిరేక ప్రభావాల నుంచి సామాన్యుల బయటపడి అక్కడే జీవించటం కలసి నడవటం ప్రారంభిస్తారు. అదే జీవితం అదే ముంబై మేరే జాన్. ఇంతకు ముందు చూడకపోతే ఇప్పుడు చుడండి.

Leave a comment