రాజమండ్రికి చెందిన శ్రీ లక్ష్మిని మష్రూమ్ మహాలక్ష్మి అని పిలుస్తారు . క్రిష్ణా జిల్లా గుడివాడకు చెందిన శ్రీ లక్ష్మి చెరిత్ర అర్ధ శాస్త్రంలో పిజీ చేసింది. పుట్టగొడుగుల పెంపకంలో హిమాచల్ ప్రదేశ్ లో ప్రత్యేక శిక్షణ తీసుకుంది. ఆధునిక పద్దతులలో పుట్టగొడుగులు పండిస్తూ మహిళారైతుగా నిలదొక్కుకున్న శ్రీ లక్ష్మి ని ఎన్నో అవార్డులు వరించాయి, సి టి ఐ ఆర్ సంస్థ తో పాటు హరియాణా ప్రభుత్వం చేత బెస్ట్ ఉమన్ ఫార్మర్ అవార్డ్ అందుకొంది. ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు చేతుల మీదుగా మహిళా రైతు నేస్తం పురస్కారం పొందింది. మహిళలకు సేద్యాన్ని మించిన ఉపాధి లేదు అంటోంది శ్రీ లక్ష్మి.

Leave a comment