Categories
శీఘ్రంగా నడిచే అలవాటున్నవారు,శరీర బరువు,నడుము కొలత వంటి వాటితో నిమిత్తం లేకుండా చాలా ఆరోగ్యంతో దీర్ఘాయుష్ష్ తో ఉంటదంటారు పరిశోధికులు. నడక వేగం ఫిట్ నెస్,పూర్తిస్థాయి ఆరోగ్యాన్ని నిర్దేశిస్తుందని,శారీరక పిట్ నెస్ ను,వాకింగ్ స్థాయిని బట్టి అంచనా వేయచ్చు అంటారు. అలాగే హ్యాండ్ గ్రిప్ స్థాయిని బట్టి కూడా అయుష్ష్ తెలుసుకోవచ్చు అంటున్నారు. నెమ్మదిగా నడిచే వారితో పోలిస్తే వేగంగా నడిచేవారిలో చేతి కున్న పట్టు (హాండ్ గ్రిప్ స్థాయి )చాలా బలంగా ఉందని అధ్యయనాలు నిరూపించాయి.