కష్టపడకుండా తక్కువ తినాలంటే హ్యాపీ హార్మోన్ లు సృష్టించండి అంటున్నాయి అధ్యయనాలు. అంటే నవ్వు కోవాలన్న మాట. హ్యాపీ హార్మోన్లు ఎక్కువ తిండి తిననివ్వవు. కొవ్వు కరిగిస్తాయి. అప్పుడప్పుడు పిస్తా పప్పు, బాదం పప్పు తింటూ ఉంటే భారీ బోజనాలు తగ్గిపోతాయి. అలాగే తక్కువ తినాలంటే ఇంకో మార్గం బుల్లి స్పూనో, ఫోర్కో ఉపయోగించాలి. తినే సమయం పెరిగిపోయి తినాలనే కోరిక పోతుంది. ఉదయాన్నే లేచే అలవాటు ఉన్నవారు తినే ఆహారం ఆలస్యంగా లేచే వారి కంటే తక్కువ ఉంటుంది. ఎనిమిది దాటాక నిద్రలేస్తే ఎక్కువ తినటమే కాక అనారోగ్యమైన ఆహారపు టైమింగ్ కు అలవాటు పడతారు. వెంట వెంటనే టిఫిన్, కాఫీ, భోజనం ఒక్కోటి వేళ మించి పోతావుంటే ఎక్కువ ఆహారం, తీసుకొంటూ ఉంటారు. అసలు ముందుగా తక్కువే తినాలనే రూల్ తో మొదలు పెడితే పట్టుదల తప్పని సరిగా తక్కువే తినేలాచేస్తుంది.