Categories
భారతదేశ శాస్త్రీయ రంగాలలో బ్రిటిష్ విశ్వవిద్యాలయంలో పి హెచ్ డి పొందిన మొదటి మహిళా శాస్త్రవేత్త కమలా సోహాని. 1912 లో జన్మించిన కమల కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయం నుంచి డాక్టరేట్ అందుకున్నారు. రాయల్ ఇన్స్టిట్యూట్ బయో కెమిస్ట్రీ విభాగానికి ప్రొఫెసర్. తాజా తాటికల్లు పై పరిశోధనలు చేశారు. పోషకాహార లోపం తో బాధపడే పిల్లలకు నీరా ఇవ్వచ్చునని ఆమె పరిశోధనలు చేసి తేల్చారు. నీరా పై ఆమె చేసిన పరిశోధనలకు రాష్ట్రపతి అవార్డు లభించింది. శాస్త్ర సాంకేతిక రంగాల్లో పనిచేసేందుకు మహిళలు కూడా అర్హులే అని పోరాడి సాధించి చూపించిన విశిష్ట మహిళ కమలాసోహాని.