
నెలసరి సమయంలో మహిళలు అనుభవించే శారీరక బాధ మానసిక వేదన కుంగుబాటు అందరికీ అర్థం కావాలని,సానిటరీ ప్యాడ్స్ కూడా కొనలేని పేదరికాన్ని తరిమికొట్టాలని, వీటి గురించి అవగాహన రావాలని, ఇందుకు పాటే మంచి మార్గం, ప్రజల్లోకి తేలికగా వెళ్ళ గలుగుతుంది. అనుకునే ఈ పాట తీసుకు వచ్చాము అంటుంది శైల తాళ్లూరి పీపుల్ ఫర్ అర్బన్ అండర్ రూరల్ ఎడ్యుకేషన్ వ్యవస్థాపకురాలు శైల ఈ పాట సృష్టికర్త. ప్యాడ్స్ ఆన్ వీల్స్ పేరిట వందల గ్రామీణ పాఠశాలల్లో నెలసరి పై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు శైల.