Categories
నెమ్మదిగా హాడావుడి లేకుండ తినండి అనే చెపుతారు పెద్ద వాళ్ళు . కానీ హడావుడి పరుగుల జీవితంలో నెమ్మది అన్న పదం అదృశ్యమైపోతుంది. తాగుతూ వంటచేయడం,తింటూ ఫోన్ మాట్లాడటం, ఆఫీస్ వర్క్ చేస్తూ స్నాక్స్ తినడం ఇప్పటి అలవాట్లు. 66వేల మందిపై అధ్యయనం చేసి ఒక రిపోర్టు ఇచ్చారు పరిశోధకులు. ఆధ్యయనం ప్రారంభానికి ముందర ‘బిఎంఐ’ని పరిగణనలోకి తీసుకున్నారు. 40శాతం మంది గబగబా ఆహారం తినేవాళ్ళు అధ్యయనం ముగిసేసరికి వీళ్ళ ‘బిఎంఐ’రిపోర్టు ఎక్కువైందట. అధిక బరువు సమస్య తలెత్తటానికి ఇదే కారణం అంటున్నాయి అధ్యయనాలు. ఆహారం నెమ్మదిగా తినండి అని హితవుచెపుతున్నారు.