Categories
చేనేత వస్త్రాల ప్రమోషన్ కోసం ఇంప్రెసా పేరుతో ఆన్ లైన్ లో చీరల అమ్మకాలు ప్రారంభించింది అంజలి. విప్రో లో చేసే సాఫ్ట్ వేర్ జాబ్ వదిలేసి కాలికట్ లో ఒక దుకాణం, ఆన్ లైన్ స్టోర్ ని ప్రారంభించింది. ఆంధ్ర ప్రదేశ్, ఒరిస్సా, మహారాష్ట్ర, రాజస్థాన్ ఇలా పలు రాష్ట్రాల్లో నేత కారులను కలుపుకొని ఆన్ లైన్ లో ఆర్డర్ లు చేస్తోంది అంజలి. పారిస్ లోని కాప్ జెమినీ 2017 లో ఇంప్రెసా ను ఉత్తమ గ్లోబల్ స్టార్టప్ గా గుర్తించింది. ఎంతో మంది విదేశీ క్లయింట్స్ ఉన్న ఈ ఆన్ లైన్ దుకాణం లో అంజలి, నాణ్యత డిజైన్లు, మార్కెటింగ్ స్వయంగా చూసుకుంటుంది. ఇంప్రెసా అంతర్జాతీయ గుర్తింపు పొందిన ఆన్ లైన్ స్టోర్.