Categories
ఒంటరి తనం ఎన్నో సమస్యలకు మూలం అంటున్నారు పరిశోధకులు.ముందుగా వాళ్ళు నిద్రకు దూరం అవుతారని పరిశోధనలు చెపుతున్నాయి.18నుంచి 25సంవత్సరాల వయస్సు గల 2500 మందిపైన దీర్ఘకాలం పరిశోధనలు చేశారు. ఒంటరి తనమనే భావన మొదట్లో కుంగుబాటుకు కారణంగా తేల్చారు.ఎప్పుడు లోపలి ఆలోచనలు షేర్ చేసుకోనే అవకాశం ఉండాలని ఆ విధంగానే మనిషిలో ఒత్తిడి మాయం అవుతోందని ఒంటరి జీవితాలు ఈ అవకాశం ఉండాలని అభిప్రాయపడ్డారు.నలుగురిలో కలిసి మెలిసి తిరిగే వారిలో ఉండే ఉత్సాహం ,జీవితకాంక్ష ఒంటరి జీవితంలో లోపిస్తుందని పరిశోధకులు స్పష్టం చేశారు. నిద్రలేమి పలు శారీరక మానసిక అనారోగ్యలకు ఒంటరిగా జీవించే వాళ్ళలో కనుగొన్నామన్నారు.