Categories
కొవ్వులేని,ఎక్కువ క్యాలరీలు లేని,రసాయనాలు లేని కొబ్బరి నీళ్ళలో అన్ని రకాల ఖనిజాలు ఉన్నాయి. ప్రకృతిసిద్ధమైన నీళ్ళ లో ఏవిధమైన కృతిమ తీపి పదార్దాలు,నిల్వవుండే రసాయనాలు ఉండవు యవ్వన సౌందర్యానిచ్చే సాచ్యురేటెడ్ కొవ్వు ఆమ్లాలు నైట్రోజెన్స్ ట్యరిక్ ఆమ్లం ఈ నీళ్ళలో ఉన్నాయి శరీరానికి అవసరమైన ఎలెక్ట్రోలైట్,పొటాషియంలు ఈ నీళ్ళలో లభిస్తాయి. ఎన్నో పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. ఈ వర్షాల్లో నీళ్ళు కలుషితం అయ్యే అవకాశాలు ఉన్నాయి కనుక దాహం వేస్తే ప్రతిచోట లభ్యమయ్యే కొబ్బరి నీళ్ళను ఓ గ్లాస్ తాగటం ఆరోగ్యం.