ఎన్నో పెళ్ళిళ్ళకు హాజరవుతాం. వందల రకాల భోజన పదార్ధాలు. ఏది తినాలో అర్ధం కానన్ని వెరైటీస్, ఎంతో వ్యర్ధం. కామార్స్ లో పీ.జీ తీసుకున్న శ్యామలా సురేష్ ఇండియన్ ఇన్స్టిట్యుట్ ఫర్ హ్యూమన్ సెటిల్మెంట్స్ విభాగంలో పని చేస్తున్నారు. ఆమె కూడా అద్భుతమైన పెళ్ళిళ్ళు, అందులో వృధా అయ్యె పదార్ధాలు ప్లాస్టిక్ ఉత్పత్తుల గురించి బాధ పడి ఎకో ఫ్రెండ్లీ మారేజస్ కి శ్రీకారం చుట్టారు. ఇవి అన్ని పెళ్ళిళ్ళ మాదిరిగానే వుంటాయి. ఈ గ్రీన్ మ్యారేజ్ కళ్యాణ మండపం లో ప్లాస్టిక్ గ్లాసులు వుండవు. గాజు గ్లాసులు, తళ తళా మెరిసే స్టీలు కంచాలు, పచ్చని అరటి ఆకులు. అంతా క్లీన్ అండ్ గ్రీన్. పోస్టర్లు అంటించి ఆహారం వృధా చేయొద్దని చెపుతారు. చిన్నా చితకా వ్యర్ధాలు కనిపిస్తే తడి పొడి పద్దతి లో వేరు చేస్తారు. కంపోస్ట్ బావుల నిర్వాహకులే చేస్తారు. కుదరక పొతే బయో గ్రీన్ ప్లాంట్లకు తరలిస్తారు. పచ్చని పందిరిలో ముచ్చటైన ఎకో ఫ్రెండ్లీ మ్యారేజస్ అంటే చాలా మంది ఆసక్తి చూపిస్తారు. పర్యావరణ హితం కోరె శ్యామలా రమేష్ బెంగుళూరు వాసి.
Categories
WoW

పచ్చని పందిట్లో ముచ్చటైన పెళ్ళి

Leave a comment