Categories
కూరలు, ఊరగాయలు, సలాడ్స్ వేటికైనా క్యాబేజ్ తిరుగులేని రుచే. పచ్చి క్యాబేజీ సన్నగా తరిగి సలాడ్ లో కలుపుకుంటే రుచి పోషకాలు రెండు లాభిస్తాయి. ప్రపంచ వ్యాప్తంగా రంగు రంగుల క్యాబేజీలు పందిస్తున్నారు. చూసేందుకు ముద్దుగా వుండే మీనియేచర్ క్యాబేజీలు కుడా వున్నాయి. ఫిటో న్యుట్రియంట్స్, యాంటి ఆక్సిడెంట్స్ పోషక విలువలు పుష్కలంగా వుండే క్యాబేజీలో కొవ్వు బాగా తక్కువే. బరువు తగ్గాలంటే ఇది సరైన ప్రత్యామ్నాయం గ్లెసమిక్ ఇండెక్స్ తక్కువగా వుంటుంది కనుక ఇది బ్లడ్ షుగర్ స్దాయిల్ని తగ్గిస్తుంది. విటమిన్ కె కి మంచి ఆదారం. అందానికి ఆరోగ్యానికి కుడా క్యాబేజీ ఉపయోగం.