Categories
వేసవి ఎండలో ఎన్ని నీళ్లు తాగినా దాహం తీరదు పైగా ఎండకు నీరసం కూడా వస్తుంది .అస్తమానం వట్టి నీళ్లు కాకుండా పోషకాలుండే ద్రవాలు తాగాలి.పుదీనా రసంలో బోలెడు పోషకాలు ఉంటాయి. శరీరం డీహైడ్రేషన్ కు గురికాకుండా ఉంటుంది. గుప్పెడు పుదీనా ఆకులు బాగా కడిగి ఓ గ్లాసు నీళ్ళలో పోసి మిక్సీలో వేయాలి ఇందులో కొద్దిగా పంచదార చిటికెడు ఉప్పు ఒక స్పూన్ నిమ్మరసం కలపాలి.చక్కెర బదులు తేనె కూడా వేసుకోవచ్చు. చల్లని ఐస్ క్యూబ్స్ వేసి ఈ పుదీనా రసం తీసుకుంటే ఎన్నో పోషకాలు శరీరానికి అందుతాయి . జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగుపడుతుంది.