పిల్లలు పుట్టిన రోజులు, పెళ్ళి రోజులు పార్టీలు ఇళ్ళలో జరుపుకుంటారు. అందుకోసం కనీసం మూడువారాల ముందు నుంచి ప్లాన్ చేయాలి అంటున్నారు ఎక్స్ పర్ట్స్. అతిధులు ఎవర్ని పిలవాలి ముందే ప్లాన్ చేసుకుని సరైన జాబితా తయారు చేసుకోవాలి. లాస్ట్ మినిట్ లో ఎవరో ఆహ్వానించటం బావుండదు. అలగే పార్టీకి ఒక థీమ్ అనుకుని అందుకు తగ్గ ఏర్పాట్లు చేయాలి. సరిపడా ఆహారం, డ్రింక్స్ ముందే ప్లాన్ చేయాలి. వచ్చే అతిధుల్లో వయసు, వాళ్ళు తీసుకునే పానీయం, తినే పదార్ధాల మెను రాసుకోవాలి. ఇల్లంతా సర్ధి వచ్చిన అతిధులు కూర్చోనెలా ఎర్పాటు చేసుకోవాలి. రెగ్యులర్ గా ఉండే ఫర్నిచర్ అలంకరణ కాస్తా మార్చినా సీరియస్ గా అందరు విశ్రాంతిగా ఉండే ఏర్పాటు చేయాలి. ముందురోజే అన్ని సరిచూసుకుని ఫ్రెష్ నెస్ కోసం ఇంటి నలుమూలల తాజా పువ్వులు అమర్చుకుని అతిధులు వచ్చే ముందరే తయారై ఉంటే సమస్య ఉండదు.
Categories