శ్రవణ మాసం నోముల పండగ ఇలాంటి పండగ వేళ చక్కని పట్టు చీరలో, లేదా పట్టుకి బదులు చందేరి సిల్క్, భాగల్ పూరి సిల్క్ చక్కగా వుంటాయి. ఈ చీరలు తేలికగా చిన్ని బుటీలతో ఉంటాయి. ప్లెయిన్ చందేరీ సిల్క్ కు జతగా ప్రింటెడ్ కలంకారీ బ్లవుజ్ వేసుకున్నా కొత్తగా కనిపిస్తుంది. పట్టు అన్చులున్న రాసిల్క్, జాట్ సిల్క్ లు కుడా పండగ ప్రత్యేకమే అలాగే ఆధునికంగా కనిపించాలంటే ఎలాంటి డిజైన్లు లేని సాదా పట్టు చీరలు, ఉప్పాడ, పోచంపల్లి, ఇకత్ వంటివి కుడా పండగ కళ తెస్తాయి వీటికి భారీ పనితనం వున్న బ్లవుజు వేసుకుంటే చక్కగా ఉంటారు.

Leave a comment