Categories
నీటి కాలుష్యంతోనే సగం అనారోగ్యాలు .నీటిని శుభ్ర పరిచేందుకు ఎన్నోన్నో ప్రయోగాలు చేస్తారు. శాస్త్రవేత్తలు .డికిన్ సన్ కాలేజీ శాస్త్రవేత్తలు తాము ఎన్నో ఏళ్ళుగా గుమ్మడి విత్తనాలు మొదలుకొని అరటి తోక్కల వరకు ఉపయోగించి ఎన్నో ప్రయోగాలు చేశామని ,నీళ్ళలో మాత్రం రంగులు లోహాల వంటి కాలుష్యాలు తొలగించేందుకు ఇవి బాగా ఉపయోగ పడతాయని పరిశోధనల్లో తేలిందన్నారు. కాయగూరలు ,పండ్ల తొక్కలు నీటిలో ఉడకబెట్టి ,ఆ తరువాత ఆరబెట్టి పొడిచేశామని ఈ పొడితో కాలుష్యాలు పోయాయన్నారు. నిమ్మ విత్తనాల పొడి చీటిలోని సీసపు అయాన్లను తొలగిస్తుందనీ పండ్ల తొక్కలు ముఖ్యంగా అరటితొక్కల పొడితో నీరు శుభ్రపడిందన్నారు.ఇది ఎంతో చౌక పద్దతి అన్నారు పరిశోధకులు.