ఒక్క సారి వెనక్కి తిరిగి చూసుకొంటే నేను చేసిన ప్రయాణం అద్భుతం .ఎలాంటి సినిమా నేపథ్యం లేకుండా ఇక్కడకు అడుగుపెట్టాను. నటిగా ,నిర్మాతగా నిలదొక్కుకున్నాను .ఇంత మంచి అవకాశాలు ఇచ్చిన చిత్రపరిశ్రమకు ఎంతో రుణపడి ఉన్నాను అంటోంది అనుష్కశర్మ. ఆమె నటించిన సూయీధాగా విడుదలకు సిద్ధంగా ఉంది. ఈరోజు నేను వ్వక్తిత్వం ఉన్నా మనిషిగా నిలబడ్డాను అంటే చిత్రపరిశ్రమే కారణం .నువ్వు సరిగ్గా ఏది కోరుకంటే అదే ఇస్తుంది. పరిశ్రమ కాస్త ఎక్కువ తక్కువ ఇవ్వదు అంటోంది అనుష్క.కానీ అదే సమయంలో చిత్ర పరిశ్రమకు నేర్చినన్ని విషయాలు ఏ రంగంలోనూ నేర్చుకోలేదు. ఎక్కడ లేనన్ని పరిక్షలు ఇక్కడ ఎదరవుతాయి అంటోంది అనుష్క శర్మ.

Leave a comment