Categories
తొలి పూజ నీకిదివో గణపయ్య….
గణములతో కూడి మమ్ము కావుమయ్యా…
శ్రీ కాళహస్తీశ్వరుని దర్శనం కంటే ముందు పాతాళ గణపతిని దర్శనం చేసుకోవాలి.చాలా శక్తిమంతమైనవాడు.అగస్త్య మహాముని కోరిక మేరకు ఈ స్వామి వెలిశాడు. సుమారు 40 అడుగుల లోతులో ఈ గణపతి కొలువై ఉన్నాడు. ఉత్తర ముఖంగా చూస్తాడు. ఇక్కడ ఙ్ఞానప్రసూనాంబ సమేత శివయ్య పశ్చిమ ముఖంగా, దక్షిణామూర్తి దక్షిణ ముఖంగా దర్శనం ఇస్తారు.
పాతాళ గణపతిని ముందుగా దర్శనం చేసుకుని తరువాత శ్రీ కాళహస్తీశ్వరుణ్ణి దర్శనం చేసుకోవాలి. అవిఘ్నమస్తూ అని అభయం ఇస్తాడు.
నిత్య ప్రసాదం: కొబ్బరి,కుడుములు,లడ్డు.
-తోలేటి వెంకట శిరీష