Categories

వాతావరణం అతి చల్లగా ఉన్న వేడిగా ఉన్న పెదాలు పొడిబారి పోతాయి. అలర్జీలు, థైరాయిడ్, ఐరన్, బి-విటమిన్ లోపం తగినన్ని నీళ్లు తాగకపోవడం మాటిమాటికి పెదాలు నాలుకతో తడపడం కూడా పెదవుల పగుళ్లకు కారణం కావచ్చు. పెదవులపై చర్మం చాలా పలుచగా ఉంటుంది. పెదవిపై నూనె గ్రంధులు ఉండవు అందుకే ఎప్పటికప్పుడు పెదవులకు పోషణ అందించడం కోసం రోజుకు మూడు లీటర్ల నీరు తాగాలి.కానీ కొన్ని రకాల టూత్ పేస్ట్ లు కూడా పడవు అదేమైనా కారణమేమో చెక్ చేసుకోవాలి.స్పూన్ కొబ్బరి నూనె బీస్వాక్స్ కోకో బటర్ కలిపి డబల్ బాయిల్ పద్ధతిలో వేడి చేసి దించాక రెండు చుక్కల ఎసెన్షియల్ ఆయిల్ కలిపి దీన్ని ఒక సీసాలో స్టోర్ చేసుకోవచ్చు దీన్ని రెగ్యులర్ గా వాడితే పెదవులు పగిలే సమస్య ఉండదు.?