చాలా పొదుపైనా ఆహారం ,మందులతో పని లుకుండా మధుమేహం కంట్రోల్ లో ఉంచుకోవచ్చునని డాక్టర్లు చెపుతున్నారు. కావలసినంత పీచు సమృద్ధిగా దొరికే బీన్స్ తప్పని సరిగా ఆహారంలో ఉండాలి. చెర్రీలు ఇంకా సూపర్ వుడ్ తీపి తినాలనే కోరికను మరల్చుకోవడానికి కొన్నీ బ్లూచెర్రీలు ,స్ట్రాబెర్రీలు ,బ్లాక్ బెర్రీలు తినవచ్చు . సాల్మన్, ట్యూన్ మెక్ రెల్ రకాల చేపలు చాలా మంచివి .అలాగే దాల్చిన చెక్క శరీరం ఇన్సులిన్ ను సరిగ్గా వినియోగించుకొనేట్లు చేస్తుంది. ఆహారంపైన కొద్దిపొడి చల్లుకున్న చాలు. ఇక గుప్పెడు నట్స్ తింటే చాలా సేపటి వరకు ఆకలి వేయదు. కార్బోహైడ్రెడ్స్ తినడం తగ్గించుకోవలనుకుంటే ఇవి పనికి వచ్చే ఆహారం .కాల్షియం దొరికే కొవ్వు లేని పాలు ,పెరుగు ఆహారంలో తీసుకుంటే చాలు . పళ్ళు ,నట్స్ కలిపి పెరుగు తిన్నప్రయోజనం ఉంటుంది.
Categories