పచ్చని మొక్క కోసం గజం స్థలం కూడా ఉండదు. అపార్టు మెంట్స్ లో వాకిలి ముందు ఓ తులసి చెట్టుపెట్టుకున్న ఒప్పుకోరు. మొక్కలు పెంచాలనే సరదా అలా కలలోనే అన్నట్లుంటుంది.  ఇదిగో పరిష్కారం గ్లాస్ గార్డెనింగ్ అందమైన గాజు పాత్ర అందులో రంగుల రాళ్ళు, మొక్కకు బలం ఇచ్చే మట్టి కోకోపేట్ బొగ్గుపొడి ఉంటే చాలు. కొన్నీ రకాల మొక్కలకు సూర్యుడి వెలుతురు అవసరమే లేదు. కాసిని నీళ్లు తాగుతూ గాజు పాత్రలోంచి వచ్చే కాంతిని ఉపయోగించుకొంటూ పెరుగుతాయి. ఇంట్లో మూలమూలన టేబుల్ పైన కిటికిల్లో , గోడకి వేలాడదీసి చక్కగా పెంచుకోవచ్చు .ఇవి అద్దాల గదుల్లోనే పెరిగే గార్డెన్స్ .మొక్కల పెంపకం ఇష్టమైన వాళ్ళు గ్లాస్ గార్టెనింగ్ గురించి ఆలోచించవచ్చు.

Leave a comment