Categories
పెద్దవాళ్లకి తెలియక కాదు కానీ ఆవేశంతో ఒళ్ళు మరిచి పోయి పిల్లల ముందే గట్టిగా అరుచుకొని దెబ్బలాడుకుంటారు. మరీ కోపం ఎక్కువైతే తామ గొడవల్లోకి పిల్లలను లాగుతారు. ఇలా పెద్దవాళ్ళ తగువుల్లో నలిగే పిల్లలు చాలా ఒత్తిడికి లోనై ఎంతో మానసిక క్షోభ అనుభవిస్తారు. వీళ్ళతో పోలీస్తే అనారోగ్యంగా ఉన్న ఉండే దంపతుల మధ్య పెరిగిన పిల్లలు చాలా ఆరోగ్యంగా,మానసికంగా కూడా ఎంతో చురుగ్గా సంతోషంగా ఉంటారని చెపుతున్నారు. పెద్దవాళ్ళ మనస్పర్థలు పిల్లల భావాద్వేగాలని దెబ్బతీసి ,ముఖ్యంగా కాస్త సిగ్గరిగా ఉండే పిల్లలు మరింత ఒత్తిడికి గురై అనారోగ్యం పాలవుతారని ఎక్స్ పర్ట్స్ హెచ్చరిస్తున్నారు.