Categories
యోగా మంచిదేనంటారు మరి ప్లస్ సైజ్ లో వుంటే ఆసనాలు ఎలా వేయాలి. శరీరాన్ని ఆరోగ్యవంతంగా ఎలా వుంచుకోవాలి? ఈ సమాధానం కోసం 34 సంవత్సరాల డాలీ సింగ్ ఇమేజస్, వీడియోస్ చూడొచ్చు. ఆమెను ప్లస్ సైజ్ ఇంటర్నెట్ యోగా క్వీన్ గా పిలుస్తారు. ఈ మధ్యనే న్యూఢిల్లీ లో నిర్వహించిన అమెజాన్ ఫ్యాషన్ వీక్ లో ర్యాంప్ వాక్ చేసి బొద్దుగా వున్న వాళ్ళ మనస్సుకి స్వాంతన కలిగించింది. ఈమె ఒక యువత చానల్ కు ప్రోగ్రాం హెడ్ గా పనిచేస్తున్నారు. నా దృష్టిలో యోగా అందానికి అవసరమే యోగా శారీరకంగా బలవంతులను చేస్తూనే మానసికంగా బలంగా మారుస్తుంది. శరీరం ఫ్లెక్సిబుల్ గా వుంటుంది అని చ్చేప్పుతుంది యోగా.