Categories
ఒక్కసారి వాషింగ్ మెషిన్ వాసన వస్తూ ఉంటుంది.కనుక లోపల బూజు ,నాచు ఏర్పడే ప్రమాదం కూడా ఉంటుంది.ఇదంతా బట్టలకు అంటుకోకుండా దానిలోకి గాలి వెళ్ళే అవకాశం ఇవ్వాలి. తడి దుస్తులు ఉతకడం పూర్తైన వెంటనే బయటకు తీసేసి గ్లాస్ డోర్,గ్యాస్కెట్ లు శుభ్రంగా తుడవాలి. లోపలి భాగంలో పొడి అయ్యేలా తలుపు తెరిచి ఉంచాలి. అలాగే డోర్ దగ్గర గ్యాస్కెట్ లో మురికి లేకుండా శుభ్రం చేసుకోవాలి.వెనిగర్,వంటసోడా వంటివి వాడి టబ్ వాష్ చేయాలి. వేడి నీరు క్లీనింగ్ కు వాడితే వాషర్ సోప్ డిస్పెన్సర్ లలో ఏదైన అదనపు పదార్ధాలు ఉంటే తొలగిపోతాయి.