పసి పిల్లలు గా ఉన్నప్పుడే హెయిర్ కేర్ అవసరం అంటారు డాక్టర్లు. పుట్టిన పిల్లల్లో కొన్ని నెలల పాటు జుట్టు పెరుగుదల అంత ఎక్కువగా ఉండదు.తరువాత చాలా త్వరగా పెరుగుతుంది మెత్తని బ్రష్ ఎంచుకోవాలి జుట్టు పలుచగా ఉన్న,వత్తుగా ఉన్న మెల్లగా దువ్వితే తలలో రక్త ప్రసరణ పెరుగుతుంది.కొబ్బరి నూనె రాసి తలకు మెల్లగా మసాజ్ చేయాలి.అలా చేస్తే జుట్టు మందంగా పెరగటమే కాకుండా పట్టు లాగా మారుతుంది. పిల్లలకు జుట్టు గట్టిగా లాగి పోనీ టెయిల్స్  వేయకూడదు.జుట్టుకు పోషకాల్ని అందించేందుకు కొబ్బరి నూనె,విటమిన్ ఇ నూనె చుక్కల్ని కలిపి మర్దన చేస్తే మంచిది.

Leave a comment