Categories
జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ఎంతో అందంగా ఉంటుంది. అందాల రహస్యం అడిగితే కేవలం జాగ్రత్తలు తీసుకోవటం అంటుంది. పుట్టుకతో వచ్చిన సౌందర్యం పోకుండా ఆహర నియమాలు పాటిస్తాను. మంచి నీళ్ళు ,గ్రీన్ టీ రోజంతా తాగుతూనే ఉంటాను. నిద్రపోయే ముందర క్లెన్సింగ్ ,టోనింగ్ , మాయిశ్చరయిజింగ్ చేస్తాను. పండ్ల రసాలు, సూప్ లు సలాడ్ లు తింటాను. పోల్ అండ్ కార్డియో ఎక్సర్ సైజ్ లు,యోగా, డాన్సింగ్ చేస్తుంటా. జుట్టు అందం కాపాడుకోవటం కోసం ఎంతో శ్రద్ద చూపిస్తా. ప్రత్యేక ఉత్పత్తులు వాడటం, జుట్టుకు నూనె రాయడం ఇవన్నీ ప్రతి రోజు జరగవలిసిందే. ఎండకు మేకప్ కు నిరంతరం చర్మం డామేజ్ అవుతూనే ఉంటుంది. ప్రత్యేక శ్రద్ద తప్పదు మరి అంటుంది జాక్వెలిన్ ఫెర్నాండెజ్.