Categories
ఇంట్లో తయారు చేసుకునే నూనెలు శిరోజాలకు మెరుపు పోషకాలు ఇస్తాయి. ఉసిరి మెంతి గింజలు కలిపి తయారు చేసుకునే నూనె, ఇటు జుట్టుకు పోషకాలతో పాటు చుండ్రుకు చక్కని ముందుగా ఉపయోగపడుతోంది. 15 గ్రాముల ఎండు ఉసిరికాయలో,ఓ స్పూన్ మెంతి గింజలు తీసుకోవాలి. మెత్తగా గ్రైండ్ చేయాలి. ఈ పొడిని వంద ఎం ఎల్ స్వచ్ఛమైన కొబ్బరి నూనెలో గానీ నువ్వుల నూనెలో కానీ కలుపుకోవాలి దాన్ని గాజు సీసాలో పోసి గట్టిగ మూత బిగించి పదిహేను రోజుల పాటు రోజు ఎండలో పెట్టి షేక్ చేస్తూ వుండాలి. తర్వాత పల్చని వస్త్రంలో వడకట్టి సీసాలోకి తీసుకొని జుట్టుకు అప్ప్లయ్ చేస్తే అన్ని రకాల శిరోజాలు గలవారికి చుండ్రు సమస్యకి మంచి పరిష్కారం అవుతోంది.