ఆందోళన లేని ఒత్తిడి లేని జీవీతం జీవించమంటారు కానీ ఎలా సాధ్యం.  జీవీతంలో ఎదురయ్యే ఎన్నో ఎత్తుపల్లాలు మనశ్శాంతిని దెబ్బతీస్తాయి కదా అని అడిగితే ఎక్స్ పర్ట్స్  ప్రాణాయామం ద్వారా పాజిటివ్ సజెషన్స్ ఇచ్చుకొండి అంటున్నారు.  సౌకర్యంగా కుర్చీలో అయినా కూర్చుని కళ్ళుమూసుకుని నెమ్మదిగా స్థిరంగా సుదీర్ఘంగా గాలీ పీల్చుకోవాలి. ఐదు సెకన్లు బిగబట్టి నెమ్మదిగా వదిలెయ్యాలి.  గాలి వదిలే సమయంలో మన శరీరంలోనుంచి ఒత్తిడి పోతున్నట్లు ఊహించుకోవాలి. తీసుకునే ప్రతిశ్వాసలో నుంచి పాజిటివ్ ఎనర్జీని లోపలికి పంపుతున్నట్లు భావించాలి. ఎక్కడ కూర్చున్న స్ట్రైట్ గా కూర్చోవాలి. మనసులో నేనంటే నాకు చాలా ఇష్టం . నన్ను నేను క్షమించుకుంటున్నాను ఎవరికి నా వల్ల కాస్త కష్టం కూడా రావద్ద్దు మంచి మాటలతో సజెషన్స్ ఇచ్చుకోవాలు. మనస్పూర్తిగా నమ్మి చేస్తే ఒత్తిడి పోతుంది.

Leave a comment