నేను నటించిన పద్మావతి విడుదల తర్వాత నటి రేఖ నాకు ఉత్తరం రాసి దాన్ని గులాబీ రేకులలో ఉంచి పంపారు అందులో రెక్కలు వాడి పోవచ్చు గానీ సువాసన ఎప్పటికీ ఉంటుంది .అలాగే సినిమా పాతదై పోవచ్చు నీ నటన వేసిన ముద్ర ఎప్పటికీ అలాగే ఉంటుంది అంటూ ప్రశంసించారు. అలాగే అమితాబ్ సార్, నిన్ను తెరపైన చూస్తున్నప్పుడు చూపు తిప్పుకోవటం కష్టం అన్నారు నేను గాల్లో తేలిపోయాను అప్పుడు అదితి రావ్ హైదారి సమ్మోహనం సినిమాలో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైనా అదితి ఇప్పుడు వి చిత్రంలో విభిన్నమైన పాత్రలో నటిస్తోంది.ఎవరి రికమండేషన్ లేకుండా ఒక్క దాన్నే సినిమా ఆఫీసుల చుట్టూ తిరిగే ఎన్నో ప్రయత్నాలు తరువాత నాకు బ్రేకీవెన్ వచ్చింది. ఆ రోజులను ఎన్నటికీ మరిచిపోను.నాకు దొరికిన ప్రతి ప్రశంస వెనక నా కష్టం ఉంది అంటోంది ఈ వనపర్తి యువరాణి అదితి రావ్ హైదారి.