నీహారికా,
ఎవరితోనైనా పది నిమిషాలు మాట్లాడితే ఎదో ఒక టెన్షన్ తో వున్నామనే అంటారు. ఇవాల్టి జీవన శైలి లో ప్రతి ఒక్కరు ఎదో ఒక్క ఒత్తిడికి గురయ్యే వారే. కేవల టెన్షన్ వాళ్ళే ఎన్నో జబ్బులు. ఏ చిన్ని సమస్య వచ్చినా తీవ్రాతి తీవ్రంగా టెన్షన్ పడితే డయాబెటిస్, బిపి, నరాల బలహీనత, గుండె జబ్బులు వంటి జీవనశైలి కి సంబందించిన అనారోగ్యాలు తప్పడం లేదు. ఊరికే టెన్షన్ పడిపోతే విసుగు, కోపం, అలసట తప్పవు. వీటికి దూరంగా ఉండాలంటే మంచి అలవాట్లు చేసుకోవాలి. ముందుగా పుస్తకాలు చదవడం, కార్టూన్ జోక్స్ బుక్స్ చాలా ముఖ్యం. కామెడీ మనస్సుకు ఉల్లాసం కలిగిస్తుంది. అలాగే మంచి సాహిత్యం జీవితం పట్ల మన దృష్టిని మార్చేస్తాయి. వొంటరిగా ఉండకుండా ఏ పార్కుకో పోవాలి. స్నేహితులతో, సన్నిహితులతో బాధను పంచుకోవాలి. మంచి సంగీతం వినాలి. మనస్సును సాధ్యమైనంత వరకు నెగిటివ్ ఆలోచనలనుంచి మళ్ళించేందుకు ఎదో ఒక వ్యాపకం పెట్టుకోవాలి. అప్పుడే టెన్షన్ నుంచి విముక్తి. అనారోగ్యాలనుంచి విముక్తి, వత్తిడి నుంచి విముక్తి, మంచి పుస్తకం ఏం ఎంచుకున్నావు? మంచి పుస్తకం ఏం వినాలనుకున్నావు?