Categories
బర్మింగ్ హామ్ యంగ్ యూనిర్సటీకి చెందిన శాస్త్రవేత్తలు ఒంటరి జీవితాలపైన అనేక సంవత్సరాలు పరిశోధన చేసి అదే మంత ఆరోగ్యకరంకాదని ,కుటుంబ జీవితం గడిపే వారితో పోలిస్తే ప్రాణాంతకమైన అనారోగ్యలు ఒంటరిగా ఉండే వాళ్ళలో కనిపిస్తున్నాయని చెపుతున్నారు. అమెకారిలో 45 ఏళ్ళ పైబడిన వారు 4.26 కోట్లు మంది ఒంటరి జీవితం గడుపుతున్నారు. వీళ్ళలో చాలా మందికి టివి ఒక్కటే కాలక్షేపం ,చిరుతిండ్లు తినటం ,మధ్యం తాగటం తప్పించి ఇంకేం చేసేపని లేదు. అయినా వారి అండదండలు లేకపోవటం తో వాళ్లలో చాలా మంది డిప్రెషన్ భారీన పడుతున్నారు. ఆరోగ్యకరమైన జీవన శైలికి దూరమై అకాల మరణాలకు గురవుతున్నారని చెపుతున్నారు. మన దేశంలోనూ ఈ ఒంటరి గా ఉండేవాళ్ళ సంఖ్య పెరుగుతోంది. ఈ రిపోర్టు ఇక్కడికీ పనికోస్తుంది.