ఈమె ఎత్తు రెండడుగుల ఆరు అంగుళాలు. బరువు కేవలం ఐదు కిలోలు. ఈ మరగుజ్జు రూపాన్ని అత్యంత పాజిటివ్ గా రిసీవ్ చేసుకుని జ్యోతి ఆడపిల్లల బ్రుణ హత్యల్ని వ్యతిరేకిస్తూ పెద్ద ప్రచారం నిర్వహించింది. ఇప్పుడీమెకు 22 సంవత్సరాలు ప్రపంచంలోనే అత్యంత పొట్టి మహిళగా రికార్డుకెక్కింది. టీవీల్లో కనపడుతూ వుంటుంది. అమెరికన్ హారర్ సిరీస్ లో ముఖ్య పాత్ర నటించింది. బిగ్ బాస్ కార్యక్రమంలో గెస్ట్ గా కనిపించింది. ఫ్యాషన్ అంటే చాలా క్రేజ్ ఎత్తు బరువుకు తగట్టు మందమైన దుస్తులు కుట్టించుకుంటుంది. చక్కగా తయ్యారు అవుతుంది.  అంత పొట్టిగా కనిపిస్తే విచిత్రంగా చూస్తుంటే, తాకేందుకు ప్రయత్నిస్తుంటే ఇచ్చిందే కానీ నన్ను తక్కువగా అంచనా వేస్తే నాకు నచ్చదు అంటుంది జ్యోతి. అంత పసి దానిలా కనపడే ఈ యువతి మహిళా శక్తి ప్రధాన్యాత ను ప్రచారం చేయడం అంటే గొప్పే కదా జ్యోతికి కంగ్రాట్స్ చెప్పేద్దాం.

Leave a comment