Categories
కొండపల్లి బొమ్మలు ఇప్పుడు ఆధునిక రూపం లోకి పరకాయ ప్రవేశం చేశాయి చదువు చెప్పే టీచర్లు, పిల్లలు, మిషన్ కుట్టే యువతి పాఠశాల దృశ్యం ఇవన్నీ ఇప్పుడు కనిపిస్తున్న బొమ్మలు, తెల్ల పాణికి చెక్కతో చేసే ఆ బొమ్మలకు చెట్ల బెరళ్లు,కాయల పై తొక్కలు గింజల పొడులతో రంగులు తయారు చేస్తారు. కనుక పిల్లలు నోట్లో పెట్టుకున్నా ఒకరి మీద ఒకరు విసురుకున్నా అంతగా దెబ్బ తగలదు. ఆఫీస్ లో ఉపయోగించే పెన్ స్టాండ్ లు, ఇంట్లో ఉపయోగపడే వస్తువులు కూడా కొండపల్లి బొమ్మలు లోకి వచ్చి చేరాయి. స్కూల్ కిట్ కోసం తెలుగు ఇంగ్లీష్ అక్షర మాల కూడా తయారు చేస్తున్నారు. ఈ సాంప్రదాయ కళలను బతికించుకోవాలి అంటే ప్రతి చిన్న వేడుకకు ఒక కొండపల్లి బొమ్మ కొన్ని పిల్లలకు ఇచ్చే అలవాటు చేసుకోవాలి.