గ్లిజరిన్ సహజమైన కార్బన్ పదార్ధం. జంతువులు, మొక్కల కొవ్వు అమ్లాల్లో దొరుకుతుంది. రంగు వుండదు సబ్బులు, క్రీములు, లోషన్లు, మాయిశ్చురైజర్ల వంటి సౌందర్య ఉత్పత్తులలో గ్లిజరిన్ వుంటుంది. ముఖంగా సబ్బుల్లో అయితే మృదువుగా తేమగా వుండేందుకు గ్లిజరిన్ వాడతారు. సలూన్ గోల్డ్ సోప్. ఇది ప్రపంచంలోనే ఖరీదైన గ్లిజరిన్ సోప్. గాజు వంటి పారదర్శకత తో మెరుస్తుంది. దీని తో రుద్దుకుంటే పూరేకులకంటే మృదువైన చర్మం సొంతం. అలాగే ఈ గ్లిజరిన్ సబ్బులో బంగారం, వజ్రాల పొడి, తేనె కలిపి, ఖతార్ రాజ కుటుంబీకుల కోసం లెబనాన్ కు చెందిన బసమా హాసన్ అండ్ సన్స్ కంపెనీ తయారు చేసింది. రెండు లక్షల రూపాయిలు ఖరీదు చేసే ఈ సబ్బు 160 గ్రాముల బరువు ఉంటుందిట చర్మాన్ని కోమలంగా ఉంచుతుందని గ్లిజరిన్ సోపుల్నే కోరుకుంటున్నారీ తరం. గ్లిజరిన్ లో పండ్ల రసాలు, ఔషదాలు, పూల రేకుల్ని కలిపి సువాసన వచ్చేలా తయారు చేస్తున్నారు. ఈ సోప్స్ చూసేందుకు ఎంతో బరువున్నాయి.
Categories