Categories
ఐ.ఎం.ఎఫ్ గోడ పైన వరుసగా ఉండే ప్రముఖ ఆర్థిక వేత్త ల ఫోటోల సరసన గీత గోపీనాథ్ ఫోటో చేరింది. ఇండియన్ అమెరికన్ ఆర్థికవేత్తగా పేరు తెచ్చుకున్న గీత గోపీనాథ్ కోల్కతా లో జన్మించారు. హర్వార్డ్ యూనివర్సిటీ ఇంటర్నేషనల్ స్టడీస్ అండ్ ఎకనామిక్స్ విభాగంలో ప్రొఫెసర్ గా పనిచేసిన గీత గోపీనాథ్, వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ అండ్ గ్లోబల్ లీడర్ (2011) పురస్కారాన్ని అందుకున్నది. 2014 లో టాప్ 25 ఎకనామిస్ట్ అండర్ 45 జాబితాలో చోటు సంపాదించింది. భారత ప్రభుత్వం అత్యున్నత పురస్కారం ప్రవాసీ భారతీయ సమ్మాన్ అందుకొన్నది ప్రస్తుతం ఎ.ఎం.ఎఫ్ మేనేజింగ్ డైరెక్టర్ పదవిలో ఉన్నారు గీత గోపీనాథ్.